గ్రానైట్‌ పరిశ్రమపై డీజిల్‌ భారం | Diesel shortage hits granite quarry operations: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ పరిశ్రమపై డీజిల్‌ భారం

Apr 28 2026 4:54 AM | Updated on Apr 28 2026 4:54 AM

Diesel shortage hits granite quarry operations: Andhra Pradesh

గ్రానైట్‌ క్వారీలో పనిచేస్తున్న పొక్లెయిన్‌లు

ఇండస్ట్రీకి వినియోగించే డీజిల్‌పై లీటర్‌కు అదనంగా రూ.55 బాదుడు 

క్వారీలు, కంకర మిల్లులు, గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై తీవ్ర ప్రభావం

చీమకుర్తి : రెండు వారాల నుంచి డీజిల్‌ కొరత గ్రానైట్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ పక్క ప్రభుత్వం తరఫున అధికారులు డీజిల్, పెట్రోల్‌ కొరత లేదంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ మరోపక్క ఎక్కడికక్కడ బంకులు మూసేసి నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి కేంద్రంగా 50కి పైగా గ్రానైట్‌ క్వారీలు, 70కి పైగా ఉన్న కంకర మిల్లులు, 600కు పైగా ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై డీజిల్‌ కొరత పెనుభారంగా మారిందని వాటి యజమానులు వాపోతున్నారు. 

పైగా.. ఇండస్ట్రీ అవసరాలకు ఉపయోగించే డీజిల్‌పై అదనంగా రూ.55 పెంచి రూ.152 లెక్కన లీటరుకు వసూలుచేస్తున్నట్లు యజమానులు గగ్గోలు పెడుతున్నారు. రెండు వారాలుగా డీజిల్‌ కొరతతో 1.30 లక్షల లీటర్ల వాడకం నుంచి ప్రస్తుతం 30 వేల నుంచి 40 వేల లీటర్లకు పడిపోయింది. దానివల్ల గ్రానైట్‌ క్వారీల్లో ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. 

కూడా నిలిచిపోవడంతో కార్మీకుల ఉపాధిపై ప్రభావం చూపుతోందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడుతున్న కారణంగానే పరిశ్రమలకు వినియోగించే డీజిల్‌ ధరలను ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా పెంచుకుంటోందని చిన్న పరిశ్రమల యజమానులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement