సార్‌ ఇటువైపు చూడండి.. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల

Deputy Speaker Kolagatla Veera Bhadra Swamy Punches on Atchannaidu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నుంచి నాకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండొద్దని కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే సభలో ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని సభా ముఖంగా తెలియజేశారు.

అయితే మేము ఈ స్థాయికి వచ్చామంటే వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా నిలిచి గెలవడమే కారణం. సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించినా.. బయట మాత్రం రాజకీయవేత్తగా కొనసాగుతానని తెలిపారు. ఇకపోతే మీరు ఎడమవైపు (తెలుగుదేశం సభ్యులు కూర్చున్న వైపు) చూడమంటున్నారు.. అయితే నేనలా చేయాలంటే మీరు సభలో కూర్చోవాలని.. మీ స్థానాల్లో మీరు లేకపోతే నేనెలా చూడగలను అంటూ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. 

చదవండి: (ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంలో పిటిషన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top