అణుశక్తి సైంటిస్టులకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | congratulations to our brilliant scientists and engineers YS Jagan | Sakshi
Sakshi News home page

అణుశక్తి సైంటిస్టులకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Apr 7 2026 3:47 PM | Updated on Apr 7 2026 4:10 PM

congratulations to our brilliant scientists and engineers YS Jagan

తాడేపల్లి : అణుశక్తి సైంటిస్టులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కల్పక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతం కావడంపై వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు IGCAR((Indira Gandhi Centre for Atomic Research), BNHAVINI( (భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్) అణుశక్తి విభాగంలోని  శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. 

‘మన దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయిని అందించింది. మన అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్  తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుంది. మన అపారమైన థోరియం నిల్వలను ఇంధన స్వావలంబనకు  వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఈ విజయం ప్రతి  భారతీయుడికి గర్వకారణం’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

కాగా,  భారతదేశం తన పౌర అణుశక్తి కార్యక్రమంలో భాగంగా సోమవారం(ఏప్రిల్‌ 6వ తేదీ)దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని సాధించింది. తమిళనాడులోని కల్పక్కం వద్ద ఉన్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) — అణువిచ్ఛిత్తి ప్రక్రియకు  చేరుకుంది.  దాంతో అణు విభజన శృంఖల ప్రతిచర్య ప్రారంభమైంది. ఫలితంగా రియాక్టర్ పూర్తి స్థాయి కార్యకలాపాలకు సిద్ధమైంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement