హాల్‌టికెట్లను తప్పుగా ముద్రించినవారిపై ఫిర్యాదు | Complaint against those who misprinted Inter hall tickets | Sakshi
Sakshi News home page

హాల్‌టికెట్లను తప్పుగా ముద్రించినవారిపై ఫిర్యాదు

May 3 2022 4:37 AM | Updated on May 3 2022 4:37 AM

Complaint against those who misprinted Inter hall tickets - Sakshi

తాడేపల్లి రూరల్‌: ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షల హాల్‌టికెట్లలో సమయం తప్పుగా ముద్రించిన ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ నిర్వాహకులపై ఇంటర్‌ పరీక్షల విభాగం అధికారులు సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  అధికారులు మాట్లాడుతూ.. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ హాల్‌టికెట్లపై సమయాన్ని ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అని ముద్రించాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అని ముద్రించారని తెలిపారు.

ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు, గోపి, ప్రతాప్‌ ఈ పని చేసినట్లు గుర్తించామని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందు కే ఇలా చేశారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.  ఇప్పటివరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న విద్యార్థులను గుర్తించి.. ఆయా కళాశాలలకు సమాచారం ఇస్తామన్నారు. అలాగే పరీక్షల సమయం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement