‘సాఫ్ట్‌ స్కిల్స్‌’ సర్టిఫికెట్లు అందజేసిన సీఎం జగన్‌ | CM YS Jagan Visakhapatnam Visit Live Updates | Sakshi
Sakshi News home page

‘సాఫ్ట్‌ స్కిల్స్‌’ సర్టిఫికెట్లు అందజేసిన సీఎం జగన్‌

Aug 26 2022 3:31 AM | Updated on Aug 26 2022 5:47 PM

CM YS Jagan Visakhapatnam Visit Live Updates - Sakshi

CM Jagan Vizag Visit.. అప్‌డేట్స్‌

►మైక్రోసాఫ్ట్‌ ద్వారా సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌

ఏయూ కాన్వోకేషన్‌ హాల్‌లో సీఎం జగన్‌ స్పీచ్‌

►సాఫ్ట్‌ స్కిల్స్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశాం

►సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు

►సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ కోసం రూ. 32 కోట్లు ఖర్చు చేశాం

►రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ

►విద్యారంగంలో ఇవాళ ఓ గర్వకారణం

►మైక్రోసాఫ్ట్‌ ద్వారా దేశంలోనే తొలిసారిగా సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ

►1.62 లక్షల మందికి సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ

►40 విభాగాల కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ

►శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు

►విద్యారంగంలో ఇప్పటికే అనేక కీలక మార్పులు తీసుకొచ్చాం

►నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, ఇంగ్లిష్‌ మీడియా వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

►ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో సీఎం జగన్‌ ప్రసంగం

►ఏపీలో ప్లాసిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం

► ఫ్లెక్సీలు పెట్టాలంటే గుడ్డతో తయారుచేసినవే పెట్టాలి

►ఈరోజు విశాఖలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగింది

► ఇవాళ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారు

►పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండు వైపులు

► పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికపురోగతి సాధించాలి

►ఏపీ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది

► సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్‌ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ

► సీఎం జగన్‌ సమక్షంలో పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ఎంవోయూ

► ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి షూస్‌, గాడ్జెట్స్‌ వంటివి తయారుచేస్తోంది

► విశాఖ చేరుకున్న సీఎం జగన్‌.. ఘన స్వాగతం

► సీఎం జగన్‌ విశాఖ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను.. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్‌ డా.మల్లికార్జున, సీపీ శ్రీకాంత్‌ గురువారం పరిశీలించారు.

► విశాఖపట్నం పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. 


షెడ్యూల్‌ 

  • ఉదయం గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి సీఎం జగన్‌ చేరుకుంటారు. 
  • అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్, బీచ్‌ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు. 
  • పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాగరతీరాన్ని పరిశుభ్రం చేయనుంది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొత్తం 20 వేల మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
  • అనంతరం సీఎం జగన్‌ సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీచ్‌ పరిరక్షణపై ఎంవోయూ కుదుర్చుకుంటారు.
  • సిరిపురంలోని ఏయూ కన్వకేషన్‌ హాల్‌కు చేరుకుని.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ అందించిన డిప్లొమా కోర్సును పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థుల్లో కొందరికి సీఎం జగన్‌ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. అక్కడి విద్యార్థులను ఉద్దేశించి..  సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. 
  • ఈ కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి ఆయన తిరుగుపయనం అవుతారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement