‘నాడు-నేడు రెండో దశ పనులు గడువులోగా పూర్తి చేయండి’ | Sakshi
Sakshi News home page

‘నాడు-నేడు రెండో దశ పనులు గడువులోగా పూర్తి చేయండి’

Published Fri, Dec 1 2023 9:09 PM

CM YS Jagan Review Meeting On Education Department - Sakshi

సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు సీఎం జగన్‌.  ఈ మేరకు నాడు-నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాడు-నేడు తొలి దశలో పూర్తైన స్కూళ్ల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలని, వెనుకబడిన వారిపై ప్రత్యేక ధ్యాసపెట్టి, వారు మెరుగ్గా తయారవడానికి అవసరమైన యాక్టివిటీస్‌ చేపట్టాలన్నారు.

డిసెంబర్‌ మూడోవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో  ఐఎఫ్‌పీ ప్యానెళ్ల ఏర్పాటు చేయాలని, మిగిలిన వారికి కూడా చేయూతనిచ్చి వారు కూడా ఇంగ్లిష్‌ మాధ్యమంలో పరీక్షలు రాసేలా చూడాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement