
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వరదలపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారాయన.
ఇలాంటి సమయాల్లోనే క్షేత్రస్థాయిలో నిలబడాలి. వరద ప్రాంతాల్లో పర్యటించండి. ముంపునకు గురైన ప్రాంతాలు, పంటపొలాలను సందర్శించండి. బాధితులకు అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోందీ. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన సైతం విడుదల చేసింది.
కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
మరోవైపు భారీ వర్షాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష కొనసాగుతోంది. మధ్యాహ్నం.. కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. వరదలు, పునరావాస చర్యలపై సమీక్ష జరుపుతున్నారు.
ఇదీ చదవండి: గోదావరి జిల్లాలకు తక్షణ నిధుల విడుదల