9న నంద్యాల జిల్లాకు వైఎస్‌ జగన్‌ | CM Jagan Nandyal District Tour on August 9 | Sakshi
Sakshi News home page

9న నంద్యాల జిల్లాకు వైఎస్‌ జగన్‌

Aug 7 2024 5:38 AM | Updated on Aug 7 2024 6:55 AM

CM Jagan Nandyal District Tour on August 9

సుబ్బరాయుడి కుటుంబానికి పరామర్శ 

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9న  నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో గత శనివారం అర్ధరాత్రి టీడీపీ మూకల చేతిలో దారుణహత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు, రెండు నెలలుగా కొనసాగుతున్న దారుణ పరిస్థితి, జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులను.. మరోసారి యావత్‌ దేశం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా, జగ్గయ్యపేట మండలం, నవాబ్‌పేటలో టీడీపీ మూకల చేతిలో  గాయపడి, విజయవాడ సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నాయకులు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శించిన అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌ ఈ విషయాలు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement