అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు: సీఎం జగన్‌ | CM Jagan Launches Jagananna Arogya Suraksha | Sakshi
Sakshi News home page

అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు: సీఎం జగన్‌

Sep 29 2023 3:48 PM | Updated on Sep 29 2023 4:35 PM

Cm Jagan Launches Jagananna Arogya Suraksha - Sakshi

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములేనన్నారు. 10,032 సచివాలయాల పరిధిలో విలేజ్‌ క్లినిక్స్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘‘ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పడతాం. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటాం’’ అని సీఎం స్పష్టం చేశారు.

ప్రతి పీహెచ్‌సీ పరిధిలో అంబులెన్స్‌ అందుబాటులో ఉండేలా చర్యలు. ఒక డాక్టర్‌ పీహెచ్‌సీలో ఉంటే ఇంకో డాక్టర్‌ అంబులెన్స్‌లో గ్రామాల్లోకి వెళ్తారు’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

చదవండి: ప్రజలందరికీ.. ‘ఆరోగ్య సురక్ష’

Advertisement
 
Advertisement
Advertisement