తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్‌ చోరీ.. భక్తుల ఆశ్చర్యం | CM Chandrababu Credit Theft In Tirumala Also | Sakshi
Sakshi News home page

తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్‌ చోరీ.. భక్తుల ఆశ్చర్యం

Mar 21 2026 12:05 PM | Updated on Mar 21 2026 2:10 PM

CM Chandrababu Credit Theft In Tirumala Also

సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‍క్రెడిట్‌ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్‌ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్‌ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI) ల్యాబ్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్‌ జగన్‌ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్‌ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్‌ జగన్‌ హయాంలోనే ల్యాబ్‌ బలోపేతమైంది.

ఇంత జరిగినా బిల్డప్‌ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్‌ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్‌ జగన్‌ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్‌ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. 

టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ

Advertisement
 
Advertisement
Advertisement