‘సీఎం జగన్‌ ఆలోచనల వల్లే కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నాం’

Chittoor Medical Officer Comments On Oxygen Plant Inauguration - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ ఆలోచనల వల్లే కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు. సీఎం జగన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించిన తర్వాత ఆ కార్యక్రమంలో డాక్టర్‌ కిరణ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం 27 పీహెచ్‌సీ ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కరోనా మొదటి, రెండవ వేవ్‌లో ఆక్సిజన్‌ లేకపోవడం వలన సుదూర ప్రాంతాలకు పంపేవాళ్లమని తెలిపారు. ప్రస్తుతం సీఎం అందించిన సదుపాయాలతో.. దేశంలో అత్యధికంగా కోవిడ్‌ నిర్ధారణ చేయగలిగామని తెలిపారు. అదే విధంగా.. కోవిడ్‌ పరీక్షలు, వ్యాక్సిన్‌లు అత్యధికంగా వేయగలిగామన్నారు. సీఎం జగన్‌ మంచి ఆలోచనల వల్ల కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో వ్యాక్సిన్‌ వేయడంలోనూ దూసుకుపోతున్నామని తెలిపారు.

అదేవిధంగా గుంటూరు జిల్లా జీజీహెచ్‌ నుంచి శైలజ అనే మహిళ మాట్లాడారు. కరోనా సెకండ్‌వేవ్‌లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని తెలిపింది. గుంటూరు జీజీహెచ్‌లో అత్యవసర విభాగంలో చికిత్స తీసుకున్నానని తెలిపింది. డాక్డర్‌లు, ఆసుపత్రి సిబ్బంది చేసిన వైద్యంతోనే ఈ రోజు బ్రతికానని కన్నీటి పర్యంతమయ్యింది. అదే విధంగా మందులతో పాటు మధ్యాహ్నం పెట్టే పోషకాహరం తనప్రాణాలు నిలవడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపింది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమకు నిత్యవాసర సరుకులు ఇంటికి తీసుకొచ్చి అందించారని తెలిపింది. మూడోవేవ్‌లో ఆక్సిజన్‌ కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు  తెలిపారు. 

కార్యక్రమంలో భాగంగా.. విశాఖపట్నం అనస్థిషియా టెక్నిషియన్‌ రవికుమార్‌ మాట్లాడారు. కోవిడ్‌ సెకండె వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత వేధించిందని, విశాఖలో 15 ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పీహెచ్‌సీ ఆక్సిజన్‌ ప్లాంట్ల వలన బాధితులకు 90 శాతం వరకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందించబడుతుందని తెలిపారు. ఈ ఆక్సిజన్‌ ప్లాంట్ల వల్ల కొండ ప్రాంతాలైన అరకు, పాడేరు ప్రాంతాలలో  ఆక్సిజన్‌ సరఫరా సులభమవుతుందని తెలిపారు. పీహెచ్‌సీ ప్లాంట్ల వల్ల అగ్నిప్రమాదాలు కూడా తక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. వెయ్యి ఎల్‌పీఎం సామర్థ్యం ఉన్న పీహెచ్‌సీ ఆక్సిజన్‌ ప్లాంట్‌తో ఒక రోజులో 25 ఐసీయూ బెడ్లకు, 100 నాన్‌ ఐసీయూ బెడ్లకు ఆక్సిజన్‌ అందించే అవకాశం ఉంటుందని రవికుమార్‌ తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ అందించిన సదుపాయాలతో కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు రవికుమార్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top