
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మరోసారి తన మార్క్ కుట్రకు తెరతీశారు. ఈ కుట్రలో కలెక్టర్లను బలిచేసినట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎరువుల కొరత అనే మాట వినిపించలేదు. కానీ ప్రస్తుతం అదే వ్యవస్థ, అదే అధికారులు ఉన్నా, రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోవడంతో రైతులు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో యూరియా కొరత ఉందనే విషయాన్ని అంగీకరించారు. అయితే చేతిలో ఉన్న సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. ఇవన్నీ మ్యాన్ మెడ్ సమస్యలే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ఈ క్రమంలో.. యూరియా సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయలేకపోయాం అgటూ యూరియ కొరత అంశాన్ని చంద్రబాబు కలెక్టర్లపై తోసేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సమావేశంలో పాల్గొన్న కలెక్టరు సైతం కంగుతిన్నారు.
క్రెడిట్‌లు కొట్టేయడంలో ఆరితేరిన చంద్రబాబు.. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు మాత్రం అవతలి వాళ్లపై నెట్టేయడంలో సిద్ధహస్తుడనే విషయం మరోసారి రుజువైందని విశ్లేషకులు అంటున్నారు.