నారా వెన్నులో ఓటమి వణుకు

Chandrababu Cheating On Chittoor People - Sakshi

సాక్షి, చిత్తూరు: చెప్పిందే చెప్పడం.. మాట మాటకు రెచ్చగొట్టే ప్రయత్నం.. ఆగ్రహంతో ఊగిపోవడం.. అడుగడుగులో తీవ్ర అసహనం.. కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఆద్యంతం ఇదే తీరు. ప్రశాంత కుప్పంలో అలజడి సృష్టించి.. వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ శ్రేణులను దాడులకు ఉసిగొలిపి ఎప్పటిలానే రాజకీయ చలికాచుకున్నారు. చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడం.. వైఎస్సార్‌సీపీ పాలనలో కుప్పం అభివృద్ధి బాట పట్టడం జీర్ణించుకోలేని బాబు.. ఈ విడత దాడు లు, వ్యక్తిగత విమర్శలతో సరిపెట్టారు. ఇన్నేళ్లు ఆదరించిన కుప్పంలో సొంత ఇల్లు కూడా లేని ఆయన.. షరామామూలుగా ప్రజలను తిట్టిపోసి, అధికార పార్టీపై నోరు పారేసుకొని ఇక్కడి నుంచి జారుకున్నారు. తాను చేసిందే అభివృద్ధి అని, రాష్ట్ర ప్రభుత్వం కుప్పానికి ఏమీ చేయలేదని చెప్పిన మాటలతో ప్రజల్లో నవ్వులపాలయ్యారు.  

సర్వే ఫలితాలతో వెన్నులో వణుకు 
చంద్రబాబు మాటల తడబాటు వెనుక సొంత సర్వేల్లో ఓటమి సంకేతాలే కారణంగా తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కుప్పం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ శ్రేణులు సైతం ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతుండడం, వరుస ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూడటంతో బాబులో ఉలికిపాటు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ విడత కుప్పం పర్యటనలో తనలోని కుట్ర కోణానికి పదును పెట్టారనే విషయం స్పష్టమైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలే ఇందుకు నిదర్శనం.  

బుధవారం వచ్చీరాగానే ఫ్లెక్సీల పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులను టార్గెట్‌ చేసుకుని దాడులకు తెగబడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు.  
♦ గురువారం కూడా అలాంటి పరిస్థితులే కలి్పంచారు. అడుగడుగునా శాంతి భద్రతలకు విఘాతం కల్పించారు. 
♦ ఇక ఆఖరిరోజు శుక్రవారం తన ప్రసంగంలో రెచ్చగొట్టే ధోరణి కనిపించింది. ప్రతి మాటలో అసహనం వ్యక్తమైంది. వ్యక్తిగత దూషణలతోనే పర్యటన ముగించారు. ‘మీ ఇంటికొచ్చి కొడతా.. తోకలు కత్తిరిస్తా.. కన్నెర్ర చేస్తా.. ఇక్కడే ఉంటా.. దమ్ముంటే రండి..’’ ఇలాంటి మాటలు ఆయనలో ఎక్కడలేని అసహనాన్ని, ఓటమి భయాన్ని బయటపెట్టాయి. 

ఎప్పటిలానే ఎల్లో మీడియా తప్పుదారి 
కుప్పంలో జరిగింది ఒకటైతే, ఎప్పటిలానే ఎల్లో మీడియా తప్పుదారి పట్టించింది. అధికార పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడింది టీడీపీ వర్గీయులైతే ‘పచ్చ’పాతం చూపింది. వైఎస్సార్‌సీపీతో పాటు పోలీసులపై దుమ్మెత్తి పోస్తూ, వాస్తవానికి విరుద్ధంగా విషం చిమ్మింది.  

పోలీసు పహారాలో కుప్పం 
ప్రశాంత కుప్పంలో రాజకీయ లబ్ధి కోసమే చంద్ర బాబు నిప్పును రాజేశారు. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ఈ నెపాన్ని వైఎస్సార్‌సీపీతో పాటు పోలీసులపై నెట్టి చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. అయినప్పటికీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి.   

► కుప్పం నుంచి ఇప్పటికీ బెంగళూరుకు వలసలు నిత్యకృత్యం. ఉపాధి లేకపోవడంతో రోజూ సుమారు 15వేల మంది కార్మికులు ఆ ప్రాంతంలో పొట్ట పోసుకుంటున్నారు. 

► కనీసం గార్మెంట్స్‌ పరిశ్రమ నెలకొప్పినా వలసలకు అడ్డుకట్ట పడుతుందని ఆ పార్టీ శ్రేణులు నెత్తీనోరు కొట్టుకున్నా 
చంద్రబాబు పెడచెవిన పెట్టారు.  

► అదిగో, ఇదిగో పరిశ్రమలంటూ అరచేతిలో వైకుంఠం చూపడంతోనే ఆయన ముఖ్యమంత్రి పదవీ కాలం గడిచిపోయింది.

► శాంతిపురం మండలంలోని కర్లగట్ట, కోతులగుట్ట, కుప్పం మండలంలోని గణే‹Ùపురం, గుడుపల్లి మండలంలోని పొగురుపల్లె ప్రాంతాలలో క్రిటానియా పరిశ్రమ కోసం ఆ సంస్థ ప్రతినిధులు సర్వే చేశారు. అయితే, బాబుకు అత్యంత సన్నిహితులైన కుప్పం టీడీపీ నాయకులు ఆ కంపెనీల్లో తమకు వాటాలు కావాలనే డిమాండ్లతో ఆ కంపెనీ వెనక్కు మళ్లింది. 

శాంతిపురం మండలంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతోపాటు కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రామాపురం, అమ్మవారి పేట, 121 పెద్దూరు గ్రామాల వద్ద భూసేకరణ చేసినా బాబు చొరవ చూపకపోవడంతో అదీ చీకట్లో కలిసిపోయింది. 

 శాంతిపురం మండలంలోని 121 పెద్దూరు వద్ద వైష్ణవి మెగాఫుడ్‌ పార్క్‌కు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కేటాయించారు. అయితే రైతులకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారు.  

 నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణం కూడా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. 

కుప్పం అభివృద్ధిలో కీలకమైన రైల్వేస్టేషన్‌లో 13 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రెండు నిముషాలను కూడా నిలిపించలేకపోయారు. 

 గుడుపల్లె మండలంలోని బిసానత్తం గని, చిగురుకుంట గోల్డ్‌ మైనింగ్‌ గనులు మూతపడి 1800 మంది కారి్మకులు రోడ్డున పడినా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తెరిపించే ప్రయత్నం చేయలేకపోవడం గమనార్హం. 

సొంత ఇల్లు ఎక్కడ బాబూ.. 
మూడు దశాబ్దాలకు పైగా కుప్పంలో పాతుకుపోయిన చంద్రబాబు ఇప్పటివరకు సొంతిల్లు నిర్మించుకోలేదు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేకు క్యాంపు కార్యాలయం కూడా లేకపోవడం గమనార్హం. చుట్టపుచూపుగా ఆర్నెల్లకో, ఏడాదికో వచ్చి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో రెండు రోజులు ఉండి వెళ్లిపోవడం చంద్రబాబుకు రివాజుగా మారింది. 

‘పెద్దాయన’ అడుగుల్లో అడుగులై! 


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంతో సమానంగా అభివృద్ధి చేస్తానని ప్రకటించడం తెలిసిందే. ఇప్పటికే కుప్పంకు మున్సిపాలిటీ హోదా కలి్పంచడం, రెవెన్యూ డివిజన్‌ చేయడం.. తాజాగా ఒక్క పట్టణ అభివృద్ధికే రూ.65 కోట్ల నిధులు విడుదల చేయడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. అభివృద్ధిలో ఇది ఒక కోణం కాగా.. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథ కం రాజకీయాలకు అతీతంగా కుప్పంలోనూ తలుపుతడుతోంది. ఇదే సమయంలో విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గ ప్రజలకు తనదైన శైలిలో భరోసా కలి్పంచడం, ప్రతి విషయంలో అండగా నిలవడం.. స్థానిక నాయకుడైన ఎమ్మెల్సీ భరత్‌ గడప గడపకూ తిరుగుతుండటం వైఎస్సార్‌సీపీ పట్ల ఆదరణ రెట్టింపయింది. ఈనేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి అభివృద్ధికి జైకొడుతున్నారు. ఇటీవల  కుప్పం, గుడుపల్లె మండలాల నుంచి వందల సంఖ్యలో టీడీపీ నేతలు ఆ పారీ్టకి గుడ్‌బై చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో టీడీపీ సభ్యత్వ కార్డులు చూపుతూ వైఎస్సార్‌సీపీ కండువాలు వేసుకొని తమ మద్దతు ప్రకటించడం విశేషం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top