
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన కర్నూలుకు చెందిన రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు
వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిక
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి పార్టీలకు భారీ షాక్ తగిలింది. బీజేపీ, టీడీపీకి చెందిన ముఖ్య నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరినవారిలో కేఆర్ మురహరిరెడ్డి (బీజేపీ ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి), కిరణ్‌కుమార్ (బీజేపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు పట్టణ ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. వారికి వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన కర్నూలు కాంగ్రెస్, టీడీపీ నాయకులు
కర్నూలు నగరానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసిన పీజీ రాంపుల్లయ్య యాదవ్ (లక్కీ2)తోపాటు మోనికారెడ్డి (51 డివిజన్ టీడీపీ కార్పొరేటర్), నరసింహులు యాదవ్ (స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్), లోక్‌నాథ్ యాదవ్ (డీసీసీబీ మాజీ డైరెక్టర్), ప్రదీప్ వెంకటేష్ యాదవ్ (రైల్వే బోర్డ్ మాజీ మెంబర్), షబ్బీర్ అహ్మద్, ఫైరోజ్ (8వ డివిజన్ టీడీపీ నాయకులు)లకు వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు అలీఖాన్, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.