రేపే ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్..‌ | AP Municipal Election Counting Tomorrow | Sakshi
Sakshi News home page

రేపే ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్..‌

Mar 13 2021 12:56 PM | Updated on Mar 13 2021 3:03 PM

AP Municipal Election Counting Tomorrow - Sakshi

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు ,70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పోరేషన్ ,చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది.

సాక్షి, అమరావతి: రేపటి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పోరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత,144 సెక్షన్ ఏర్పాటు చేశారు.

కౌంటింగ్ కోసం కార్పోరేషన్లలో 2204 టేబుళ్లు, మున్సిపాలిటీలలో 1822 టేబుళ్లు మొత్తం 4026 టేబుళ్లు ఏర్పాటు చేశారు.  కార్పోరేషన్‌లలో కౌంటింగ్ సూపర్ వైజర్లు- 2376, కౌంటింగ్ సిబ్బంది -7412 మంది, మున్సిపాలిటీలలో కౌంటింగ్ సూపర్ వైజర్లు-1941, కౌంటింగ్ స్టాఫ్ సిబ్బంది 5195 మందిని ప్రభుత్వం నియమించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 పోలీసు సిబ్బంది నియమించారు. ఇందులో 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1345 మంది ఎస్‌ఐలు, 17292 మంది కానిస్టేబుళ్లు,ఇతరులు1134 మందిని ప్రభుత్వం నియమించింది.

11 కార్పోరేషన్లలో స్థానికంగా 16 కౌంటింగ్  కేంద్రాలు ఏర్పాటు.. 
విజయనగరం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- పాత బస్టాండ్ సమీపంలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్
విశాఖపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- ఆంధ్రా యూనివర్సిటీ  ప్రాంగణం,వాల్తేరు
విజయవాడ కార్పోరేషన్  ఓట్ల లెక్కింపు- ఆంధ్ర లయోలా కళాశాల
మచిలీపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- కృష్ణా యూనివర్సిటీ
గుంటూరు కార్పోరేషన్‌లో  స్థానికంగా నాలుగు కేంద్రాల్లో  ఓట్ల లెక్కింపు
ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ న్యూబ్లాక్‌
నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్
ప్రభుత్వ టెక్స్ టైల్స్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్
ఒంగోలు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- సెయింట్ క్సావియర్ హైస్కూల్‌ కళాశాల
అనంతపురం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు -ఎస్‌ఎస్ బీఎమ్ జూనియర్ కళాశాల
కర్నూలు కార్పోరేషన్‌లో 3 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రాయలసీమ యూనివర్సిటీ
సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల
పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల
చిత్తూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు - పీవీకెఎన్ ప్రభుత్వ కళాశాల
తిరుపతి కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు - ఎస్ వీ ఆర్ట్స్ కళాశాల
మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎక్కడికక్కడ అన్ని వార్డులను కలిపి ఒకే కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


చదవండి:
పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు లేవు
రూపకర్తకు నీరాజనం.. జెండాకు వందనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement