సీఎం జగన్‌ కేసుల ఉపసంహరణపై హైకోర్టులో వాదనలు

Ap High Court Ag Sree Ram On Sumoto Case Cm Ys Jagan - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ అంశంపై ఏపీ హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. జ్యుడీషియల్‌ అధికారాలను హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ అతిక్రమించిందని ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం వ్యాఖ్యానించారు. హైకోర్టు పరిపాలనా విభాగం సుమోటోగా తీసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ మొత్తం సీఆర్పీసీకి విరుద్ధంగా నడుస్తోందని ఏజీ వాదించారు.

హైకోర్టులో రోస్టర్‌ జ్యుడీషియల్‌ పరిధిలోని అంశమేనని ఆయన తెలిపారు. గతంలో అడ్మినిస్ట్రేటివ్‌ వివరాలతో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ వ్యాఖ్యలు చేస్తే.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. మాకు నోటీసులు ఇవ్వకుండానే మీడియాలో చర్చ జరిగిందని అన్నారు. ఓ టీవీ ఛానల్‌ ఏకంగా పెద్ద కార్యక్రమాన్నే నడిపిందని ఏజీ శ్రీరాం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ నిర్ణయాలు తీసుకుందని టీవీ కార్యక్రమంలో చర్చించారని, దిగువ కోర్టు ఆర్డర్స్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని ఆయన కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు కేసును ఈనెల 25కు వాయిదా వేసింది.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన జస్టిస్‌ వి.కనగరాజ్‌

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top