2018 గ్రూప్‌-1 రద్దు తీర్పు.. ఆందోళన వద్దన్న ఏపీ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు తీర్పు.. ఆందోళన వద్దన్న ఏపీ ప్రభుత్వం

Published Wed, Mar 13 2024 12:23 PM

AP Group 1 Mains Dismissed By AP high Court - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మెయిన్స్‌ను మళ్లీ ఆరు నెలల్లోపు నిర్వహించాలంటూ బోర్డుకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

2018లో 167 పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్‌ చేసింది ఏపీపీఎస్సీ. అయితే.. డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ హైకోర్టుని అశ్రయించిన కొందరు అభ్యర్ధులు. అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఎపీపీఎస్సీ వాదించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనల అనంతరం.. మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాల్సిందేనని జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు

అయితే హైకోర్టు తీర్పుపై గ్రూప్‌ వన్‌ ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది. ఈ క్రమంలో.. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది.

Advertisement
Advertisement