
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనంపై చట్ట ప్రకారం, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
సాక్షి, అమరావతి: ‘న్యాయమూర్తులపై నిఘా’ అంటూ ఆంధ్రజ్యోతి, టీవీ 5 వార్తా సంస్థల్లో వచ్చిన కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ రెండు మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలుకు సన్నద్ధమైంది. పరువునష్టం దావా సహా, చట్టపరమైన చర్యలపై ప్రభుత్వం యంత్రాంగం దృష్టి సారించింది. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా, పక్కా వ్యూహంతోనే ఈ కథనం అల్లారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఓ పక్కా వ్యూహంతోనే న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కథనంపై న్యాయ వ్యవస్థతో నేరుగా సంప్రదింపులు జరిపి దీని వెనుక కుట్రను వివరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ఇది బీసీలపై దాడే...)