‘అన్న క్యాంటీన్‌’ సీఈఓకు నెలకు రూ.4 లక్షల వేతనం | Anna Canteen CEO gets Rs.4 lakh per month salary: ap | Sakshi
Sakshi News home page

‘అన్న క్యాంటీన్‌’ సీఈఓకు నెలకు రూ.4 లక్షల వేతనం

Sep 28 2025 6:16 AM | Updated on Sep 28 2025 6:16 AM

Anna Canteen CEO gets Rs.4 lakh per month salary: ap

దాతల నుంచి సేకరించే విరాళాల నుంచి చెల్లింప

పురపాలక శాఖ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: అన్న క్యాంటీన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు సీఈఓగా పోతుల వంశీధర్‌ను ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెలకు రూ.4 లక్షల వేతనం (జీతం రూ.3 లక్షలు, కారు అలవెన్సు రూ.60 వేలు, ఇతర అలవెన్సులు రూ.40 వేలు) ఇవ్వాలని నిర్ణయించింది. దాతల నుంచి సేకరించే విరాళాలతో ఆయనకు ఈ వేతనాన్ని చెల్లంచాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేష్‌­కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్రంలో కార్పొ­రేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో ఉన్న అన్న క్యాంటీన్లను ప్రారంభించిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇందుకోసం ఓ ఛారిటబుల్‌ను ట్రస్టును ఏర్పాటుచేసి.. విరా­ళాలు సేకరిస్తోంది. వాటితో అన్న క్యాం­టీన్ల ద్వారా ప్రజలకు రూ.5కే టిఫిన్, రూ.5కే భోజ­నం అందిస్తున్నట్లు చెబుతోంది. కానీ, వీటి నిర్వహణకు నియమించే సీఈఓకు మాత్రం నెలకు రూ.4 లక్షలను వేతనంగా చెల్లించాలని నిర్ణయించడంపై సర్వ­త్రా విస్మ­యం వ్యక్తమవుతోంది. ఇది అత్త సొమ్ము అల్లు­డి దా­నం అన్నట్లుగా ఉందని రాజకీయ వర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement