దారుణం: రెండో సంతానంగా పాప పుట్టిందని..

Andhra Pradesh: Husband Molested His Wife In East Godavari  - Sakshi

సాక్షి, రామచంద్రపురం రూరల్‌(తూర్పుగోదావరి): తన భర్త మానసికంగా, శారీరకంగా  వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారని ద్రాక్షారామ ఎస్సై ఆదివారం తెలిపారు. వివరాలివి... ఉట్రుమిల్లిలో రాజీవ్‌ గృహకల్ప అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కర్రి వీరవేణికి, మండపేట మండలం అర్తమూరు శివారు చింతలతోటకు చెందిన కర్రి సత్యనారాయణరెడ్డితో 2017లో వివాహం జరిగింది. వారికి మూడేళ్ల బాబు, 10 నెలల పాప ఉన్నారు. రెండో సంతానంగా బాబు కాకుండా పాప పుట్టడంతో తనను నిత్యం వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

అసభ్య ప్రవర్తనపై మహిళ ఫిర్యాదు
రామచంద్రపురం రూరల్‌: తాను ఇంట్లో ఉండగా మోర్త చిరంజీవి అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వేగాయమ్మపేటకు చెందిన బొమ్ము లక్ష్మి ఫిర్యాదు చేశారని ద్రాక్షారామ ఎస్సై ఆదివారం తెలిపారు. వివరాలివి... స్వల్పంగా గాయపడ్డ ఆమెను బంధువులు రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.బాధితురాలి ఫిర్యాదుతో పాటు ఆస్పత్రి  సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top