నంద్యాల: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం

Amjad Basha Consoles Nandyala Family Suicide Victims - Sakshi

సాక్షి, కర్నూలు: నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్‌ సలామ్‌ కుటుంబ సభ్యులను సోమవారం డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ సలామ్‌ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా హామీ ఇచ్చారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలపై ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించిన చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.   (సీఐ సోమశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌)

అబ్దుల్ సలామ్‌ ఘటనపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రత్యేక అధికారుల ద్వారా సమగ్ర దర్యాప్తు చేపడుతుంది. వీరిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలకుండా దర్యాప్తు జరుగుతంది అని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా వెల్లడించారు. కాగా గతంలోనే సామూహిక ఆత్మహత్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లను ఇప్పటికే సస్పెండ్‌ చేస్తూ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top