ఏపీ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ విరాళమిచ్చిన ఆటా | America Telugu Association Donates Oxygen Concentraters To AP Government | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ విరాళమిచ్చిన ఆటా

Jun 1 2021 3:55 PM | Updated on Jun 1 2021 4:50 PM

America Telugu Association Donates Oxygen Concentraters To AP Government - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌-19 నేపథ్యంలో ఏపీకి ఆటా(అమెరికా తెలుగు అసోసియేషన్‌) తమ వంతు సాయం అందించింది. 50 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను టీటీడీ ఛైర్మన్‌ వైవి. సుబ్బారెడ్డికి ఆటా ప్రతినిధులు మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద  అందించారు. ప్రాథమికంగా 50 కాన్సంట్రేటర్స్‌ను అందించిన ఆటా మొత్తంగా 600 కాన్ససెంట్రేటర్లను ఏపీ వ్యాప్తంగా అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ  త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా కావాలని తాము కోరుకుంటున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు భువనేష్‌ భుజాల, కార్యదర్శి హరిప్రసాద్‌ లింగల తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement