గుర్రం జాషువా స్మృతికి రూ.3 కోట్ల నిధులు

Allocation Of Funds For The Establishment Of The Gurram Jashuva Auditorium - Sakshi

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: గుర్రం జాషువా స్మృతికి రూ.3 కోట్ల నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాషువా సమాధి అభివృద్ధి, ఆడిటోరియం ఏర్పాటు కోసం ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, గుంటూరు నడిబొడ్డున జాషువా కళాప్రాంగణం అభివృద్ధికి సీఎం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 28న జాషువా జయంతి సందర్భంగా తెలుగు అకాడమీ ద్వారా ‘సాహిత్య పురస్కారం’ ప్రదానం చేస్తామన్నారు. జాషువా గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంపై దళితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సురేష్‌ తెలిపారు.(దళితులపై చంద్రబాబు కపట ప్రేమ)

గుర్రం జాషువాకు నివాళి..
గుర్రం జాషువా 49వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి విజయవాడ సిటీ ప్రెసిడెంట్‌ బొప్పన భవకుమార్‌.. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల చైర్మన్లు నివాళులర్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top