వైభవం.. సిడిమాను ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. సిడిమాను ఉత్సవం

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

రాయదుర్గంటౌన్‌: పట్టణంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కోటలోని మారెమ్మ ఆలయం, నేసేపేటలోని దండుమారెమ్మ, కొల్లాపురమ్మ ఆలయాల వద్ద సిడిమానుకు యువకుడిని కట్టి తిప్పారు. దుగ్గిలమ్మ జాతర మరుసటి రోజు సిడిమాను ఉత్సవం నిర్వహించడం ఆచారం. కోటమారెమ్మ ఆలయం వద్ద జరిగిన ఉత్సవానికి రాయదుర్గం నియోజకవర్గంతోపాటు సరిహద్దు కర్ణాటకలోని గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. సాయంత్రం 6 గంటలకు సిడికి యువకుడిని కట్టి మూడుసార్లు తిప్పారు. సిడిమానుకు భక్తులు అరటిపండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement