అనంతపురం అర్బన్: మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పయనం పతనం దిశగా సాగుతోందని సీపీఐ నాయకులు విమర్శించారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసుల చేత కూర్రంగా దాడి చేయించడమే ఇందుకు నిదర్శమన్నారు. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక క్లాక్‌టవర్ వద్ద నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి మాట్లాడారు. విద్యార్థులు, యువతపై లాఠీచార్జీ అమానుష చర్య మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య హక్కుపై దాడి చేయడమే అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకులు మస్తాన్, సాయికుమార్, రామకృష్ణ, నారాయణస్వామి, రమణయ్య, కృష్ణుడు, లింగమయ్య, చిరంజీవి, నరేషన్, తదితరులు పాల్గొన్నారు.


