పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ పరలోకాలకు | - | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ పరలోకాలకు

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

రోడ్డు ప్రమాదంలో

యువకుడి దుర్మరణం

తాడిపత్రి రూరల్‌: మండలంలోని పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తాడిపత్రి అప్‌గ్రేడ్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని గంగాదేవిపల్లికి చెందిన సతీష్‌ (25), నాగేంద్ర ద్విచక్రవాహనంలో మంగళవారం రాత్రి తాడిపత్రిలో నిర్వహించిన తమ స్నేహితుడు సతీష్‌ కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన సతీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేష్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సతీష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్‌కు ఆస్పత్రిలో చికిత్సలందించారు. ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మృతుడు సతీష్‌కు భార్య పుష్పతో పాటు రెండు నెలల చిన్నారి ఉన్నట్లు తెలిసింది.

పశుగ్రాసం కోసం ప్రోత్సాహం

అనంతపురం అగ్రికల్చర్‌: ‘హరిత గోపాలం’ పేరుతో ఉపాధిహామీ పథకం కింద పశుగ్రాసం పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్‌ తెలిపారు. అందుకు సంబంధించి పోస్టర్లను బుధవారం కలెక్టరేట్‌ లో కలెక్టర్‌ ఆనంద్‌ చేతుల మీదుగా విడుదల చేయించారు. పశు, జీవ సంపద పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement