జిల్లాలో కరువు కారణంగా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు సంక్షోభంలో ఉన్నారు. భూసారం, తేమ, పచ్చదనం క్షీణించి, జీవ వైవిధ్యం వేగంగా నశించి, ఎడారీకరణ జరుగుతోంది. సుస్థిర వ్యవసాయ విధానమే ఇందుకు పరిష్కారం. ప్రకృతిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంతో పాటు రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెనుముప్పు నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
– డాక్టర్ వై.వీ.మల్లా రెడ్డి,
డైరెక్టర్, ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్


