అనంతపురం: వైఎస్సార్ సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా రచించిన ‘జననేత జగనన్న ప్రజా సంకల్ప పాదయాత్ర’ పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆవిష్కరించారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రతో పాటు 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాల గురించి పుస్తకంలో వివరించినట్లు రచయిత కట్టుబడి తానీషా పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ సాకే శైలజానాథ్, పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి, డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ టీచర్ పొలమడ రమేష్ బాబు, రవి తదితరులు పాల్గొన్నారు.


