బురదలోనే కూర్చొని ప్రార్థనలకు సిద్ధమవుతున్న ముస్లింలు
ముస్లింలపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో రెండు సార్లు వచ్చే రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో ఎంతో పవిత్రంగా తాము సామూహిక ప్రార్థనలు జరుపుకునే ఈద్గా ప్రాంతాల్లో కనీస మౌలిక వసతుల కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది రంజాన్ మాసంలో, తిరిగి గురువారం జరుపుకున్న బక్రీద్ ప్రార్థనల్లో తాము ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి అనంతపురంలోని ఈద్గా మైదానం బురదమయమైందని, దీంతో గురువారం బురద మధ్యలోనే సామూహిక ప్రార్థనలు ముగించాల్సి వచ్చిందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పర్వదినాల నాడు ఈద్గా మైదానాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పించేవారని, ఆ ఐదేళ్లూ తాము ఎలాంటి అసౌకర్యాలకు లోను కాలేదని గుర్తు చేస్తున్నారు. ముస్లింలపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


