రాప్తాడు రూరల్: అహుడాకు సంబంధించిన ఎంఐజీ లేఔట్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. అనంతపురం రూరల్ మండలం కందుకూరు సమీపంలోని ఎంఐజీ లేఔట్‌లో చేపట్టిన పనులను గురువారం జేసీ పరిశీలించారు. ఆయన వెంట అహుడా ఈఈ దుష్యంత్, ఇన్‌చార్జ్ తహసీల్దార్ అరుణ, ఆర్‌ఐ సందీప్‌కృష్ణ ఉన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. పనులను వేగవంతం చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు.


