ఆహార భద్రత కరువు | - | Sakshi
Sakshi News home page

ఆహార భద్రత కరువు

Mar 17 2026 7:38 AM | Updated on Mar 17 2026 7:38 AM

చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు ఆహార భద్రత కరువైందని ఏపీ మహిళ సమాఖ్య నాయకురాళ్లు మండిపడ్డారు. చౌక ధరల దుకాణాల ద్వారా 18 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిత్యావసర సరుకులతో ధర్నా చేశారు. సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతీప్రసాద్‌, పద్మావతి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలోని ఈ రెండేళ్లలో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. పేదలకు బియ్యంతో పాటు 18 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని, లేకపోతే ప్రజాసంఘాలను కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకురాళ్లు కమ్మక్క, సారంబి రమీజా, జానకి, ఆజాబీ, శివమ్మ, కుళ్లాయమ్మ, హసీనా, సాయిలీలా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement