మోకాళ్ల నొప్పులు ప్రధానంగా కీళ్ల క్షీణత (ఆర్థరైటిస్), అధిక బరువు, గాయాలు, బలహీనమైన కండరాలు, విటమిన్ డీ3 లోపం వల్ల వస్తాయి. బరువు తగ్గడం, క్రమబద్ధమైన వ్యాయామం, పౌషకాహారం తీసుకోవడం వల్ల నొప్పులను నివారించవచ్చు. క్యాల్షియం, విటమిన్ డీ3 పుష్కలంగా ఉండే ఆహారం స్వీకరించాలి. రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, అన్ని రకాల పండ్లు చేర్చుకోవాలి. ఒమేగా–3 అధికంగా, కొవ్వు తక్కువ ఉండే చేపలు, అవిసె, ఆక్రోట్ గింజలు బాగా తినాలి.
– డాక్టర్ బి. మహమ్మద్ గౌస్,
ఆర్థోసర్జన్, అనంతపురం


