వంట గ్యాస్ సరఫరాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాంటూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప మాట్లాడారు. మరోవైపు గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని వంట గ్యాస్ కష్టాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేంద్రకుమార్, రామిరెడ్డి, రామాంజనేయులు, వెంకటనారాయణ, ముత్తూజ, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


