అనంతపురం: కరువు సీమలో కల్పతరువుగా ఉన్న ఆర్డీటీని పరిరక్షించాలంటూ వైఎస్సార్‌సీపీ సాగిస్తున్న పోరాటం ఢిల్లీని తాకింది. సోమవారం పార్లమెంట్ వద్ద సేవ్ ఆర్డీటీ అంటూ వెఎస్సార్‌సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు నినాదాలు చేశారు. సేవ్ ఆర్డీటీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్డీటీ లేకపోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల శ్రేయస్సుకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేస్తూ విదేశీ నిధులు అందేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, గురుమూర్తి, మాజీ ఎంపీలు వెవీ సుబ్బారెడ్డి తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.


