క్రికెటర్‌ దీపికకు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ దీపికకు ఘన స్వాగతం

Dec 8 2025 8:12 AM | Updated on Dec 8 2025 8:12 AM

క్రికెటర్‌ దీపికకు ఘన స్వాగతం

క్రికెటర్‌ దీపికకు ఘన స్వాగతం

మడకశిర/అమరాపురం: అంధుల మహిళల టీ20 ఇండియా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ దీపికకు అమరాపురం మండలం తంబాలహట్టి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల కొలంబోలో జరిగిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి కప్‌ను కై వసం చేసుకోవడంతో కెప్టెన్‌ దీపిక దేశానికి పరిచయమయ్యారు. దీపిక వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తంబాలహట్టికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆమైపె పూల వర్షం కురిపించి.. హారతులు పట్టారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎస్‌ఐ ఇషాక్‌బాషా ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

నేడు మడకశిరలో సన్మానం ..

అంధుల మహిళల టీ20 ఇండియా క్రికెట్‌ టీం కెప్టెన్‌ దీపిక సోమవారం మడకశిరకు వస్తున్నారు. ప్రపంచ కప్‌ గెలిచిన తర్వాత తొలిసారిగా మడకశిరకు వస్తున్న నేపథ్యంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement