వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు
అనంతపురం: వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అనంతపురం అర్భన్ నియోజకవర్గానికి చెందిన గువ్వల రాజేష్‌రెడ్డిని రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా, కళ్యాణదుర్గానికి చెందిన ఇ.రాము బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా, బిక్కి నాగలక్ష్మి రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రెటరీగా, టి.వన్నూర్ స్వామిని ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా, జి.నాగరాజును ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నియమించారు. అలాగే కళ్యాణదుర్గానికి చెందిన పి.నరేష్ బాబును పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీగా, ఆలమూరు కృష్ణారెడ్డిని జిల్లా కార్యదర్శిగా, కె.తిప్పేస్వామిని జిల్లా కార్యదర్శిగా నియమించారు. కళ్యాణదుర్గానికి కె.మహలింగను జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా, ఎం.లింగప్పను ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా, యు.శ్రీనివాసులును ఎస్సీ సెల్ జిల్లా సెక్రెటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


