బిలాస్‌పూర్‌–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

బిలాస్‌పూర్‌–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు

Nov 28 2025 8:31 AM | Updated on Nov 28 2025 8:31 AM

బిలాస్‌పూర్‌–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు

బిలాస్‌పూర్‌–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బిలాస్‌పూర్‌–యలహంక మధ్య వారాంతంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ తెలిపారు. 5 సర్వీసులు మాత్రమే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్‌ 2వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు బిలాస్‌పూర్‌ జంక్షన్‌ (08261)లో రైలు బయలుదేరి మరుసటి రోజు (బుధవారం) సాయంత్రం 6.30 గంటలకు యలహంక జంక్షన్‌కు చేరుతుందన్నారు. అదేవిధంగా యలహంక జంక్షన్‌ (08262) నుంచి డిసెంబర్‌ 3 బుధవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజూమున 4.30 గంటలకు రైలు చేరుతుందన్నారు. భాతాపుర, రాయపూర్‌, దుర్గ్‌, చందా పోర్ట్‌, సిరిపూర్‌, మంచర్ల, ఖాజాపేట్‌, చర్లపల్లి, సికింద్రాబాద్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. రైళ్లలో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement