‘కాలవ’పై టీడీపీ సీనియర్ల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

‘కాలవ’పై టీడీపీ సీనియర్ల ఆగ్రహం

Nov 20 2025 6:44 AM | Updated on Nov 20 2025 6:44 AM

‘కాలవ’పై టీడీపీ సీనియర్ల ఆగ్రహం

‘కాలవ’పై టీడీపీ సీనియర్ల ఆగ్రహం

కణేకల్లు: రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులుపై టీడీపీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ చూస్తుండగానే తీవ్ర స్వరంతో నిలదీశారు. వివరాలు.. కణేకల్లులో బుధవారం ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సొల్లాపురం గ్రామానికి చెందిన పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన సొల్లాపురం ఎంపీటీసీ కేశవరెడ్డితోపాటు మరికొందరిని వేదికపైకి ఎమ్మెల్యే కాలవ ఆహ్వానించి పెద్దపీట వేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటి వరకూ కింద కూర్చొని ఉన్న అదే గ్రామానికి చెందిన సీనియర్‌ టీడీపీ నాయకులు ప్రసాద్‌, వేణు, రామ్మోహన్‌తో పాటు పలువురు ఒక్కసారిగా కాలవను చుట్టుముట్టారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన తమకు ప్రాధాన్యతినివ్వకుండా ఇతర పార్టీ నుంచి కొత్తగా వచ్చిన వారికి ఎలా గుర్తింపునిస్తున్నారంటూ నిలదీశారు. సీనియర్లంటే లెక్కలేదా? కొత్త వారే నీకు ఎక్కువయ్యారా? అంటూ ప్రశ్నించారు. దీంతో కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది. పలువురు బుజ్జగించే ప్రయత్నం చేయగా... ‘మీకు ఇలాగే జరిగితే గమ్మునుంటారా?’ అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో కాలవ సైగలతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలో దిగి పార్టీ సీనియర్‌ నేతలను పక్కకు పిలుచుకెళ్లారు.

డ్రిప్‌ పంపిణీ వేగవంతం చేయాలి

ప్రాజెక్టు ఆఫీసర్‌ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశం

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో డ్రిప్‌, స్ప్రింక్లర్ల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఏపీఎంఐపీ అధికారులను ఆ ప్రాజెక్టు ఆఫీసర్‌ (పీఓ) ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం ఆయన గుంటూరు నుంచి జిల్లా అధికారులు, కంపెనీ డీసీఓలు, ఎంఐ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాకు కేటాయించిన 18 వేల హెక్టార్ల లక్ష్యంలో ఇప్పటి వరకూ 8,947 హెక్టార్లకు మంజూరు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 38,138 హెక్టార్లకు డ్రిప్‌ కావాలని రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని, రక్షేతస్థాయిలో 19,816 హెక్టార్ల ప్రాథమిక పరిశీలన పూర్తి చేసినట్లు పీడీ రఘునాథరెడ్డి, ఏపీడీ ధనుంజయ వివరించారు. తుది పరిశీలన కూడా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

రిమాండ్‌కు దుర్గా

ఆటో మొబైల్స్‌ యజమాని

అనంతపురం సెంట్రల్‌: జిల్లా కేంద్రంలో మారుతీ సుజికి – దుర్గా ఆటో మొబైల్స్‌ షోరూం నిర్వహిస్తున్న రాజేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనంతపురం వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన వివరాలను వెల్లడించారు. స్థానిక గుత్తి రోడ్డులో మారుతీ సుజికి కార్ల షోరూం నిర్వహిస్తున్న రాజేష్‌ భారీగా అప్పులు చేసి ఇటీవల అనేక మందికి ఐపీ నోటీసులు ఇచ్చాడు. దీనికి తోడు కొత్తగా కార్లు కొనుగోలుకు వెళ్లిన వారు చెల్లించిన మొత్తాన్ని సొంతానికి వాడుకుని వాహనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడు. ఇలాంటి బాఽధితులు 30 మందికి పైగా ఉండగా ఇటీవల ముగ్గురు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం బుధవారం రాజేష్‌ను అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement