టిష్యూ కల్చర్ అరటి పరిశోధనా కేంద్రానికి స్థల పరిశీలన
తాడిపత్రి రూరల్: టిష్యూ కల్చర్ అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు తాడిపత్రి మండలం తలారి చెరువు, భోగసముద్రం గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను ఉద్యానశాఖ జిల్లా అధికారి ఉమాదేవి, ఇతర అధికారులు శుక్రవారం పరిశీలించారు. అరటికి సంబంధించి 50 ఎకరాల్లో టిష్యూ కల్చర్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వెంట బీబీఎస్‌ఎస్‌ఎల్ ఎండీ చేతన్‌జోషి, టీం లీడర్ జయప్రకాష్, గ్లోబల్ అగ్రి సిస్టం పైవేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజర్ విశాల్ శ్రీవాత్సవ, తాడిపత్రి ఉద్యాన అధికారి ఉమాదేవి, ఏడీహెచ్ దేవానందం, ఆర్‌ఐ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ రామ్మోహన్‌నాయుడు తదితరులు ఉన్నారు.


