
అరాచకాలకు ‘డిజిటల్ బుక్’తో చెక్
గుంతకల్లు టౌన్: అధికారమదంతో విర్రవీగుతున్న కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలకు బుద్దిచెప్పేందుకే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. రెడ్‌బుక్ పేరిట కూటమి నేతలు, కొంత మంది పోలీసు అధికారులు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సోషియల్ మీడియా యాక్టివిస్ట్‌లను వేధిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హింసా రాజకీయాలకు పాల్పడిన నేతలతో పాటు అక్రమ కేసులు బనాయించిన అధికారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి, న్యాయపోరాటం సాగిస్తామన్నారు. అన్యాయానికి గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ భరోసా లాంటిదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్.భవాని, వైస్ చైర్‌పర్సన్ నైరుతిరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఖలీల్, రాము, కౌన్సిలర్లు నీలావతి, కుమారి, చాంద్‌బాషా, సుమోబాషా, లింగన్న, ఎంపీటీసీలు హనుమంతు, సర్పంచులు నారాయణస్వామి, నాగార్జున, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు వీరేష్, కొంగనపల్లి, అంజి, పవన్, బాసిద్, బాబూరావు, వార్డు ఇన్‌ఛార్జ్‌లు దర్గానాయుడు, ఎల్లప్ప, సీనియర్ నాయకులు మల్లికార్జున శాస్త్రి, ఫ్లయింగ్‌మాబు, నూర్‌నిజామి, ఎంఎం.రెహమాన్, నల్లప్ప, నాయకులు జయన్న, తిక్కస్వామి, గోవింద్‌నాయక్, జయరామిరెడ్డి, రామాంజి, సోమిరెడ్డి, వెంకటేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అధికారం శాశ్వతం కాదు..
అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని తెలుసుకుని ఇప్పటికై నా అధికార మదాన్ని వీడాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ హితవు పలికారు. స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ హేళనగా మాట్లాడినా.. సొంత తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీలో ఏమీ మాట్లాడకపోయినా తన కుటుంబసభ్యులను దూషించారని బోరున విలపించిన చంద్రబాబు.. సాక్షాత్తూ జూనియర్ ఎన్‌టీఆర్ మాతృమూర్తిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసభ్యకరంగా దూషించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
డిజిటల్ బుక్ ఆవిష్కరణలో
మాజీ ఎమ్మెల్యే వైవీఆర్