
‘అనంత’ జానపద కళావైభవం
అనంతపురం కల్చరల్: ‘అనంత’ జానపద నృత్యం మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారులు, విద్యార్థుల జానపద ప్రదర్శనలతో అనంతపురం లలితకళాపరిషత్తు సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు హోరెత్తింది. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రంగస్థల సకలవృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘జానపద కళా వైభవం –2025’ పేరిట నిర్వహించిన మహాబృంద నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. సంస్థ నిర్వాహకులు సురభి ఆనంద్, డ్యాన్స్‌మాస్టర్ రమేష్ సంయుక్త నేతృత్వంలో 2025 మంది కళాకారులు అనంతకే సొంతమైన జానపదాలను అద్భుతంగా ప్రదర్శించి అలరించారు. ఈ ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్‌ుడ్స, మిరాకిల్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో నమోదు అయినట్టు నిర్వాహకులు తెలిపారు.
యువకుడి బలవన్మరణం
యాడికి: మండలంలోని నారాయణస్వామి కాలనీకి చెందిన రమణమ్మ కుమారుడు సత్య (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమెకు నలుగురు కుమారులు కాగా, ఇద్దరు కుమారులు పెళ్లి చేసుకుని తిరుపతిలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు సత్య బేల్దారి పనులతో తల్లిని పోషించుకునేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతుండడంతో పనికి వెళ్లొద్దని తల్లి నచ్చచెబుతూ వచ్చింది. అయినా సత్య వినకుండా అలాగే పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం మూడో కుమారుడు బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సత్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ప్రతి చిన్నారికీ టీకా తప్పనిసరి : డీఎంహెచ్‌ఓ
అనంతపురం మెడికల్: ప్రతి చిన్నారికీ వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా అందజేసేలా ‘యూ విన్’ పోర్టల్‌ను అందుబాటులో తీసుకువచ్చినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి తెలిపారు. పోర్టల్‌కు సంబంధించిన పోస్టర్లను సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ యుగంధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అనుపమజేమ్స్, డాక్టర్ విష్ణుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

‘అనంత’ జానపద కళావైభవం