
ప్రశ్నపత్రం తారుమారు
అనంతపురం: ఎల్‌ఎల్‌బీ పరీక్షల్లో ప్రశ్నపత్రం తారుమారు కావడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. సోమవారం ఎస్కేయూలో ఎల్‌ఎల్‌బీ రెండో సెమిస్టర్‌లో భాగంగా ఫ్యామిలీ లా –1 పరీక్ష నిర్వహించారు. వర్సిటీలోని ఫార్మసీ కళాశాల పరీక్షల భవనంలోని గది నంబర్ –4లో ప్రశ్నపత్రం తారుమారైంది. వాస్తవంగా ఫ్యామిలీ లా –1 సబ్జెక్టుకు 80 మార్కులు ఎక్స్‌టర్నల్, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు కేటాయించారు. ప్రస్తుతం 80 మార్కులకు పరీక్ష జరగాల్సి ఉంది. అయితే 100 మార్కుల ప్రశ్నపత్రాన్ని అందజేయడం గమనార్హం. ఇందులోనూ కొంతమందికి వేర్వేరు ప్రశ్నపత్రాలు అందజేయడంతో గందరగోళం నెలకొంది. 40 మంది విద్యార్థులకు సమస్య ఎదురైంది. దీనిపై ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి వర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ బాబుకు ఫిర్యాదు చేశారు.
వాస్తవ ప్రశ్నపత్రం
(80 మార్కులు )
సిలబస్‌లో లేని ప్రశ్నలతో ప్రశ్నపత్రం (100 మార్కులు)

ప్రశ్నపత్రం తారుమారు