
ముగ్గురు చిన్నారులకు డెంగీ
గుత్తి: పట్టణంలో ముగ్గురు చిన్నారులకు డెంగీ సోకింది. జ్వరంతో బాధపడుతున్న బండగేరికి చెందిన వెంకట కృష్ణ, చెర్లోపల్లి ప్రాంతానికి చెందిన ముస్తాక్, షణ్ముఖను సోమవారం తల్లిదండ్రులు గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ముగ్గురికీ డెంగీ సోకినట్లు నిర్ధారించారు. గుత్తి పట్టణంలో అపరిశుభ్రత, పారిశుధ్యం లోపించడంతో వైరల్ ఫీవర్లు అధికమయ్యాయి. జ్వర బాధితులతో సోమవారం ఆసుపత్రి కిటకిటలాడింది. తగినంత మంది వైద్యులు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు.
నూర్పిడి యంత్రం బోల్తా.. మహిళా కూలీ మృతి
కణేకల్లు: వేరుశనగ నూర్పిడి యంత్రం బోల్తాపడిన ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందింది. మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. తుంబిగనూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు సోమవారం ఉదయం మీన్లహళ్లి గ్రామంలో ఓ రైతు పొలంలో వేరుశనగ నూర్పిడి చేసేందుకు నూర్పిడి యంత్రంతో బయల్దేరారు. గరుడచేడు దాటిన తర్వాత వంక వద్ద ప్రమాదవశాత్తు నూర్పిడి యంత్రం బోల్తా పడింది. యంత్రంపై కూర్చొని ఉన్న మహిళా కూలీ గౌరమ్మ (42), వనజాక్షి, స్నేహిత, సుజాతమ్మ, గంగమ్మ కిందపడ్డారు. గౌరమ్మపై యంత్రం పడడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. మిగిలిన నలుగురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే చికిత్స కోసం కణేకల్లులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే గౌరమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ముగ్గురు చిన్నారులకు డెంగీ

ముగ్గురు చిన్నారులకు డెంగీ