
జిల్లాకు 6.57 లక్షల స్మార్ట్ రైస్ కార్డులు
అనంతపురం అర్బన్: జిల్లాలో 6,57,248 మంది కార్డుదారులకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులను అందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ తెలిపారు. సోమవారం అనంతపురంలోని అశోక్‌నగర్‌లో కార్డుదారుల ఇళ్లకు వెళ్లి స్మార్ట్ రైస్ కార్డులను ఆయన అందజేశారు. ప్రతి కార్డుదారునికి ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వెళ్లి కార్డును పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చామన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, అర్బన్ తహసీల్దార్ హరికుమార్, సీఎస్‌డీటీ బాషా, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు ఎంపిక
గుంతకల్లు రూరల్: ఈ నెల 13న అనంతపురం వేదికగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఈత పోటీల్లో గుంతకల్లు మండలం తిమ్మాపురం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 19 విభాగంలో సి. రాకేష్, అండర్ 14 విభాగంలో ఎన్.అభిరామ్ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు విజయప్రకాష్ తెలిపారు.

జిల్లాకు 6.57 లక్షల స్మార్ట్ రైస్ కార్డులు