
ఎవరో చేస్తారని ఎదురు చూడకుండా..
పెద్దపప్పూరు/శెట్టూరు: ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమకున్న వనరులతోనే రోడ్డు మరమ్మతులకు యువత పూనుకుంది. వారి సంకల్పాన్ని గమనించిన పలువురు అభినందనలతో ముంచెత్తారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట – కొండాపురం మార్గంలో ఓ చోట దెబ్బతిన్న జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బంది పడకుండా మరమ్మతులకు ముచ్చుకోటకు చెందిన రమేష్, చరణ్ శ్రీకారం చుట్టారు. ఆదివారం దాదాపు రెండు గంటల పాటు శ్రమించి రోడ్డును బాగు చేశారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శభాష్ రమేష్, చరణ్ అంటూ నెటిజన్లు అభినందించారు. అలాగే శెట్టూరు నుంచి కళ్యాణదుర్గం వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా గుంతలు పడడంతో ‘హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు నవీన్, మహేష్, బాలరాజ్, సురేష్, సత్యనారాయణ, రఘు, వీరేష్, సుఖేష్‌బాబు ఆదివారం పూడ్చివేశారు. సిమెంటు, కంకర కలిపి పూడ్చి వేయడంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. దీంతో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులను పలువురు అభినందించారు.

ఎవరో చేస్తారని ఎదురు చూడకుండా..