
వివాహిత బలవన్మరణం
గుత్తి: స్థానిక ఆర్‌ఎస్‌లోని రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న డీజిల్‌షెడ్ మెకానిక్ హరి భార్య శిరీష(32) ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో భార్య ఇచ్చిన టీ తాగిన అనంతరం హరి డ్యూటీకి వెళ్లిపోయాడు. అనంతరంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న శిరీష ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించి చుట్టుపక్కల వారి సమాచారంతో హరి ఇంటికి చేరుకుని శిరీషను వెంటనే రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేశారు.