
అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
రాప్తాడు రూరల్: అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా దేశంలో ఓ పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు లౌకిక, ప్రజాతంత్ర వాదులు, కుల సంఘాల నాయకులు, వామపక్ష భావజాలం కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, శింగనమల నియోజకవర్గ కార్యదర్శి కత్తి నారాయణస్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, అనంతపురం రూరల్ మండల కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి నరేష్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ, నాయకులు దుర్గాప్రసాద్, ఆనంద్, మంజునాథ్, చందు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ