పాలకుల చేతకానితనంతో జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. నెల రోజులుగా దాదాపు 200 టీఎంసీల తుంగభద్ర, కృష్ణా జలాలు దిగువకు వెళ్లిపోయాయి. కానీ జిల్లాకు వచ్చింది మాత్రం 5 టీఎంసీలే. ఈ ఏడాది వర్షాలతో జలాశయాలు ముందుగానే నిండినా జిల్లాకు మాత్రం అనుకున్న స్ | - | Sakshi
Sakshi News home page

పాలకుల చేతకానితనంతో జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. నెల రోజులుగా దాదాపు 200 టీఎంసీల తుంగభద్ర, కృష్ణా జలాలు దిగువకు వెళ్లిపోయాయి. కానీ జిల్లాకు వచ్చింది మాత్రం 5 టీఎంసీలే. ఈ ఏడాది వర్షాలతో జలాశయాలు ముందుగానే నిండినా జిల్లాకు మాత్రం అనుకున్న స్

Aug 6 2025 7:02 AM | Updated on Aug 6 2025 7:02 AM

పాలకు

పాలకుల చేతకానితనంతో జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం జర

తుంగభద్ర జలాశయం నుంచి నదికి పోతున్న నీరు

అనంతపురం సెంట్రల్‌: హెచ్చెల్సీ, హంద్రీ–నీవా ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు సాగు, తాగునీటిని అందిస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి గ్రావిటీ ద్వారా, శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవాకు ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. రెండు ప్రాజెక్టుల నుంచి సరైన సమయంలో నీరు తీసుకుంటేనే జిల్లాకు న్యాయం జరుగుతుంది. అయితే, ఈ ఏడాది పనులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో నీటిని తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేశారు. ఆలస్యం కారణంగా ఇప్పటి వరకూ 5 టీఎంసీల నీరు మాత్రమే జిల్లాకు చేరాయి. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి 1.875 టీఎంసీలు విడుదల చేయగా జిల్లా సరిహద్దులోకి 1.688 టీఎంసీలు చేరాయి. ప్రస్తుతం జిల్లా సరిహద్దులో 1,796 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. హంద్రీ–నీవా ద్వారా ఇప్పటి వరకూ 3.78 టీఎంసీలు వచ్చాయి. జీడిపల్లి జలాశయం నిండిన తర్వాత పీఏబీఆర్‌కు నీటిని మళ్లించారు.

సమీక్షించిన పాపాన పోలేదు..

హెచ్చెల్సీ, హంద్రీ–నీవా ద్వారా జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించవచ్చు. అలాగే, వందలాది చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోకుండా చర్యలు చేపట్టవచ్చు. ఈ క్రమంలో ఈ ఏడాది తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు ముందుగానే నిండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా... ఇంత వరకూ నీటి ప్రణాళికలపై సమీక్షించిన పాపాన పోలేదు. ఈ క్రమంలో జూన్‌లోనే జలాశయాలు పూర్తిగా నిండినా ఇప్పటి వరకూ పట్టుమని పది టీఎంసీలు తీసుకురాలేకపోయారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి నీటి విడుదలకు డిమాండ్‌ నెలకొంది. నీరు విడుదల చేస్తే ఆయకట్టు కిందే కాకుండా పరివాహక ప్రాంతాల్లో బోరుబావుల కింద పంటలను రక్షించుకుంటామని పేర్కొంటున్నారు. జిల్లాలోని రిజర్వాయర్లలో తగినంతగా నీటి నిల్వలు లేకపోవడంతోనే ఐఏబీ సమావేశం నిర్వహించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆగస్టు 15 తర్వాత నిర్ణయం

తుంగభద్ర జలాశయం నుంచి వీలైనంత ఎక్కువ నీటిని తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. పీఏబీఆర్‌లో పూర్తిస్థాయికి నీటి మట్టం చేరితే ఎంపీఆర్‌కు విడుదల చేస్తాం. తర్వాత ఆయకట్టుకు నీటిని అందిస్తాం. ఆగస్టు 15 తర్వాత ఐఏబీ సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని విడుదల చేశాం. ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు హంద్రీ–నీవా ద్వారా అందిస్తున్నాం. టీబీ డ్యాం నుంచి తొలుత 18 టీఎంసీలే కేటాయించారు. అది 24 టీఎంసీలకు పెరిగే అవకాశముంది. నీరు ఎక్కువ వస్తే అన్ని ప్రాంతాల్లోని ఆయకట్టుకు అందిస్తాం.

– సుధాకర్‌రావు, ఎస్‌ఈ, హెచ్చెల్సీ

నీటి ప్రణాళికలపై

చేతులెత్తేసిన పాలకులు

ఆశగా అన్నదాతల ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఇదీ దుస్థితి

పాలకుల చేతకానితనంతో జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం జర1
1/1

పాలకుల చేతకానితనంతో జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం జర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement