
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. గ
55 రోజుల తర్వాత వర్షం
అనంతపురం అగ్రికల్చర్: 55 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత వరుణుడు కరుణించాడు. ప్రధాన పంటలు విత్తుకునే సమయం ముగిశాక వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 19.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో పదును వర్షం కురవగా మిగతా మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. బెళుగుప్ప మండలంలో అత్యధికంగా 90.8 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే, డి.హీరేహాళ్ 58.2 మి.మీ, నార్పల 46.2, రాయదుర్గం 45.6, యల్లనూరు 39.2, కళ్యాణదుర్గం 32.2, ఉరవకొండ 30.2, యాడికి 28.4, కణేకల్లు 26.2, వజ్రకరూరు 22.4, పెద్దపప్పూరు 20.6, విడపనకల్లు 16.2, బ్రహ్మసముద్రం 15.4, గుంతకల్లు 15.2, తాడిపత్రి 13.4, శెట్టూరు 12.6, కంబదూరు 12.4, బొమ్మనహాళ్ 11.8, గార్లదిన్నె 10.6, గుమ్మఘట్ట 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆగస్టులో 83.8 మి.మీ గానూ ప్రస్తుతానికి 23 మి.మీ వర్షపాతం నమోదైంది. ఓవరాల్‌గా జూన్ 1 నుంచి 135.5 మి.మీ గానూ 22 శాతం తక్కువగా 105.6 మి.మీ నమోదైంది. ఈ రెండు నెలల్లో 8 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. కాగా, రాగల ఐదు రోజులూ ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు.