
సెంట్రల్ యూనివర్సిటీలో ‘మిషన్ మాలవ్య’ కేంద్రం
అనంతపురం: అనంతపురం శివారులోని జంతలూరు వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మిషన్ మాలవ్య ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం (ఎంఎంటీటీసీ) ఏర్పాటుకు అనుమతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల అధ్యాపకులకు ఆధునిక, నాణ్యమైన శిక్షణ అందించి వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ కేంద్రం దోహదపడనుంది. వినూత్న బోధనా పద్ధతులు, బోధనలో సాంకేతికత వినియోగం, పాఠ్యాంశాల రూపకల్పన, పరిశోధన, మూల్యాంకన పద్ధతులు, అంతర శాసీ్త్రయ బోధన విధానాలు ఈ కేంద్రం ప్రధాన లక్ష్యాలని వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్‌ఏ కోరి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ షీలా రెడ్డి తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు వర్సిటీకి, విద్యారంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.